వరుడి చెంప చెళ్లు మనిపించిన వధువు.. పూలమాల వేయడానికి వస్తే.. వీడియో వైరల్

Published : Apr 19, 2022, 12:06 PM IST
వరుడి చెంప చెళ్లు మనిపించిన వధువు.. పూలమాల వేయడానికి వస్తే.. వీడియో వైరల్

సారాంశం

ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వధువు స్టేజ్ మీద వరుడి చెంపలు వాయించి, స్టేజ్ దిగి వెళ్లిపోయింది. దీంతో వరుడు షాక్ అయ్యాడు.

లక్నో : లక్నోలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వధువు, వరుడు మండపంలో ఉన్నారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. వధువు, వరుడు కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. దీంతో ఆహ్వానితులు, అతిథులు అందరూ షాక్ అయ్యారు.

ఇంతకీ ఏమైందంటే.. తన మెడలో దండ వేయడానికి వచ్చిన వరుడిని వధువు చెంపమీద లాగిపెట్టి కొట్టింది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు అలాగే కొట్టింది. ఆ తరువాత దండను విసిరేసి స్టేజ్ మీదినుంచి దిగి పరిగెత్తుకుంటూ పెళ్లి హాల్ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది.  

వరుడు తనకు కాబోయే భార్యకు దండ వేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ముహూర్తం సమీపించగానే దండను ఆమె మెడలో వేయబోయాడు. అంతే ఒక్కసారిగా వధువు నుంచి అనుకోని రియాక్షన్ వచ్చింది. వరుడు వేసే దండను స్వీకరించడానికి బుదులుగా ఆమె అతని ముఖం మీద గట్టిగా కొట్టింది, ఇది వీడియోలో కనిపిస్తోంది. అయితే వధువు ఇలా చేయడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. 

అయితే, ఈ ఘటనతో ఇరు వర్గాల బంధువులు, కుటుంబీకులు షాక్ అయ్యారు. ఆ తరువాత ఇరువైపులా కుటుంబసభ్యుల జోక్యంతో ఇరువర్గాల మధ్య సఖ్యత కుదిరిందని సమాచారం. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్
Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?