నేరస్తుడితో న్యాయమూర్తి లిప్ లాక్.. వీడియో వైరల్..!

Published : Jan 13, 2022, 09:45 AM IST
నేరస్తుడితో న్యాయమూర్తి లిప్ లాక్.. వీడియో వైరల్..!

సారాంశం

ఓ మహిళా న్యాయమూర్తి నేరస్తుడి ప్రేమలో పడిపోయింది. అక్కడితో ఆగలేదు.. వారిద్దరూ జైల్లోనే రొమాన్స్ పండించడం గమనార్హం. వారి రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్ కావడం గమనార్హం.

మామూలుగా అయితే.. ఓ నేరస్తుడి..కోర్టులో న్యాయమూర్తి శిక్ష వేస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ.. శిక్ష వేయాల్సిన మహిళా న్యాయమూర్తి.. నేరస్తుడి ప్రేమలో పడటం ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే జరిగింది. ఓ మహిళా న్యాయమూర్తి నేరస్తుడి ప్రేమలో పడిపోయింది. అక్కడితో ఆగలేదు.. వారిద్దరూ జైల్లోనే రొమాన్స్ పండించడం గమనార్హం. వారి రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్ కావడం గమనార్హం. ఈ సంఘటన అర్జెంటీనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఆ మహిళా న్యామూర్తి.. ఖైదీకి ఘాఢమైన ముద్దు ఇవ్వడం స్పష్టంగా కనపడుతోంది. మహిళా న్యాయమూర్తి ముద్దుపెట్టుకున్న ఖైదీ పోలీసు అధికారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అర్జెంటీనా మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో ఇప్పుడు విచారణ జరుగుతోంది. డెయిలీ మెయిల్  రిపోర్ట్ ప్రకారం.. డిసెంబరు 29న జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ను న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకున్న వీడియో బయటపడింది.

 

దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లో న్యాయమూర్తి అయిన మారియల్ సువారెజ్, డిసెంబర్ 29 మధ్యాహ్నం ట్రెలెవ్ నగరానికి సమీపంలో ఉన్న జైలులో క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ను ముద్దుపెట్టుకోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. 2009లో అధికారి లియాండ్రో ‘టిటో’ రాబర్ట్స్‌ను హత్య చేసినందుకు బస్టోస్‌కు జీవితకాలం జైలు శిక్ష విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్‌ ఇటీవల సమావేశమైంది. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్‌ను రక్షించడానికి ఆమెకు మద్దతు లభించలేదు. దీంతో అతడికి జీవిత కాలానికి శిక్ష విధించబడింది

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్