ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ అధికారి మీద దాడి చేసింది. అతడి కాలర్ పట్టుకుని బెదిరించింది. కాళ్లతో ఎగిరెగిరి తన్నడానికి ప్రయత్నించింది.
ముంబయి : మద్యం తాగి వాహనం నడపడం నేరం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా దీనిని పట్టించుకోకుండా ఫంక్షన్ లు, పార్టీలు అంటూ ఫుల్ గా తాగి రోడ్డుపైకి వస్తుంటారు. తాగి వాహనం నడపటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు అవుతుంటాయి. వీటిని అరికట్టేందుకు పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ ల పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని మార్పులు చేపట్టినా మందుబాబుల ప్రవర్తనల్లో మార్పులు రావడం లేదు. కొంతమంది తాగి బండి నడపడమే కాకుండా.. ఎదురు పోలీసుల మీదే తిరగబడుతున్నారు. అచ్చం ఇలాగే మద్యం మత్తులో ఓ యువతి పోలీసు అధికారితో మర్చిపోయి ప్రవర్తించింది.
undefined
ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. ఫుల్ గా తాగిన ఓ యువతి కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదికి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. తాగిన మైకంలో అందరినీ తిడుతూ నానా హంగామా చేసింది. అదే సమయంలో అటుగా వెళుతున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల రాకతో ఆవేశంతో ఊగిపోయింది సదరు యువతి. తాగిన మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా ప్రవర్తించింది. విధుల్లో ఉన్న పోలీసులు పట్ల నడిరోడ్డుపై దురుసుగా ప్రవర్తించింది. ఆయన కాలర్ పట్టుకుని బెదిరిస్తూ వాగ్వివాదానికి దిగింది. పోలీసు అధికారి జుట్టుపట్టుకుని ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా చివర్లో పోలీస్ ధరించిన మాస్క్ ని లాక్కుని కింద పడేసింది.
అయితే, ఇంత జరుగుతున్నా ఆ పోలీస్ అధికారి ఆమెను ఏమీ అనలేదు. మహిళ కావడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. యువతి మీద మీదకు వస్తుంటే ఆమెను దూరంగా జరిపాడు. యువతి ప్రవర్తిస్తున్న తీరును కొంతమంది తమ ఫోన్ లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కావడంతో ఆ పోలీస్ అధికారి నిస్సహాయంగా ఉండిపోయారని లేకుంటే మరోలా ఉండేది అని కామెంట్ చేస్తున్నారు.
एक और परी की Video Viral है।
देखिए कैसे एक पुलिस अधिकारी की वर्दी का कॉलर पकड़ कर खड़ी है और पुलिस वाला बेबस है।
क्योंकि जानता है गलती से अगर उसने लड़की को ही हाथ लगा दिया तो क़ानून उसको ही नाप देगा। pic.twitter.com/5AHtj3E2A7