కెనడియన్ డీజే ఒకరు దీపికా పదుకొనే ఆస్కార్ ప్రసంగాన్ని ర్యాప్ సాంగ్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చిన వేళ.. తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం ఉర్రూతలూగిపోయింది. ఈ సమయంలో ఈ పాటను పరిచయం చేస్తూ ఆస్కార్ వేదిక మీద బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇచ్చిన స్పీచ్ కూడా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాటను పరిచయం చేస్తూ ఆమె ‘టోటల్ బాంగర్’ అంటుంది. ఆ తరువాత ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వేదిక మీద డ్యాన్సర్లు ప్రదర్శన చేశారు.
దీపికా పదుకొనే ఈ చిన్న ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇదే ఓ కెనడియన్ డీజేను ర్యాప్ చేసేలా ప్రోత్సహించింది. దీపికా మాటల్ని తీసుకుని ఓ చిన్న ర్యాప్ సాంగ్ చేశాడు ఆ గాయకుడు. సిక్కిక్గా అనే అకౌంట్ తో ఉన్న ఆ డిజే.. దీపిక ఆస్కార్ ప్రసంగం నుండి ''టోటల్ బ్యాంగర్'' అనే పదాలను వాడుకున్నాడు. వాటిని రీమిక్స్ చేశాడు. ఈ వెర్షన్ను రూపొందించడానికి దానిని ఆకర్షణీయమైన బీట్తో విలీనం చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశాడు.
undefined
Deepika Padukone: వామ్మో.. కేన్స్ లో దీపిక ధరించిన నెక్లెస్ ధర ఇన్ని కోట్లా..!
ఇలా చేయడం గురించి రాస్తూ.. సిక్కిక్ "నేను ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ ను చూస్తున్నాను. అందులో దీపికాపదుకొనే అద్భుతమైన ప్రసంగం విన్నాను. దీంతో నాకు ఈ చిన్న సంగీతాన్ని రూపొందించడానికి నిజంగా ప్రేరణ దొరికింది. ఆమె ప్రసంగంలోని టోటల్ బ్యాంగర్.. అనే పదాల్ని తీసుకుని ఇది చేశాను' అని రాసుకొచ్చాడు.
ఈ ర్యాప్ సాంగ్ ను ఇన్స్ స్టా యూజర్స్ చాలా ఇష్టపడ్డారు. అతని మీద, అతని ఐడియా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చాలా మంది ఈ పాట పూర్తి వెర్షన్ కావాలని డిమాండ్ చేసారు. ఒకరు రాస్తూ.. దీపికా ఇప్పుడు సిక్ కిక్ సంచలనాలలో మరొక సంచలనంగా మారింది.. అన్నారు.. ఇంకొకరు ''ఈ పాట టోటల్ బ్యాంగర్ పూర్తి వెర్షన్ మాకు కావాలి' అని డిమాండ్ చేస్తే.. మరొకరు.. ‘ఇదేం బాలేదు.. మరీ ఇంత బాగా ఉండడం చట్టవిరుద్ధం అంటూ కామెంటాడు.
దీనిమీద దీపిక రియాక్ట్ అయ్యింది. వైరల్ అయిన ఈ ర్యాప్ సాంగ్ ను ఆమె తన ఇన్ స్టా పోస్టులో షేర్ చేసుకుంది.