ఈ చైనా వాళ్లు మారరా..? బతికున్న చేప తిని..

By telugu news teamFirst Published Jul 23, 2020, 3:16 PM IST
Highlights

ఎందుకంటే.. అతని లివర్ సగం ఖాళీ అయ్యింది. ఓ పరుగు అతని లివర్ ని కేకు మాదిరి కొరుక్కోని మరీ తింటూ కనిపించింది. ఆ పరుగు అతని శరీరంలోకి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..బతికున్న చేపను తినడం వల్ల అని తెలిసింది.
 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ తొలుత చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు పచ్చిమాంసం తినడం వల్లనే ఈ వైరస్ పుట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ఉపద్రవం ముంచుకువచ్చినా.. చైనా ప్రజల్లో కొంచెం కూడా మార్పురాలేదు. ఇప్పటికీ పచ్చిమాంసమే తింటున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలానే పచ్చిమాంసం తిని.. తన లివర్ కి  సమస్య తెచ్చుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలుగు రోజులుగా విరేచనాలు, అలసట, కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో అతడు హస్పిటల్‌కు వెళ్లాడు.

ఏమైందా అని పరీక్షలు చేసిన పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే.. అతని లివర్ సగం ఖాళీ అయ్యింది. ఓ పరుగు అతని లివర్ ని కేకు మాదిరి కొరుక్కోని మరీ తింటూ కనిపించింది. ఆ పరుగు అతని శరీరంలోకి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..బతికున్న చేపను తినడం వల్ల అని తెలిసింది.

అతను కొద్ది రోజుల క్రితం ఓ బతికున్న చేపను ఆబగా మింగేశాడు. అయితే.. ఆ చేపలోపల ఓ పరాన్నజీవి( చూడటానికి వానపాములాగా ఉండే ఓ పురుగు) ఉండటాన్ని అతను గమనించలేదు. ఇతను చేపను ఆరగిస్తే.. ఆ లోపల పరుగు కాస్త.. అతని లివర్ తినేసింది.

కాలేయం సగం మాయమవ్వడమే కాకుండా అందులో 19 సెంటీ మీటర్ల పొడవు, 18 సెం.మీ. వెడల్పు ఉన్న చీము గడ్డ కనిపించింది. దాని చుట్టు పెద్ద పెద్ద గడ్డలు కూడా ఏర్పడటం మొదలైంది.

దీంతో వెంటనే చికిత్స మొదలుపెట్టారు. గడ్డల్లోని చీమును సగం వరకు తొలగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు కాలేయాన్ని కూడా కొంతవరకు తొలగించాల్సి వచ్చింది. వాటిలో బల్బుల తరహాలో ఉన్న చిన్న చిన్న పరాన్నజీవి గుడ్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

చేపల్లో కంటికి కనిపించని పరాన్నజీవులు ఉంటాయి. వాటిని పచ్చిగా తిన్నప్పుడు.. వాటిలో ఉండే పరాన్నజీవులు, బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అవి శరీరంలోనే గుడ్లు పెట్టి తమ సంతానాన్ని పెంచుకుంటాయి. శరీర అవయవాలను కొరుక్కు తింటూ క్రమేనా అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇతని విషయంలో కూడా అదే జరగడం గమనార్హం.

click me!