ప్రస్తుతం కరోనా భయం అందరినీ వెంటాడుతోంది. ఆ మహమ్మారి ఏ వైపు నుంచి వెంటాడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో పక్క మనిషి తుమ్మినా, దగ్గినా అనుమానంతో కళ్లు పెద్దవి చేస్తారు
ప్రస్తుతం కరోనా భయం అందరినీ వెంటాడుతోంది. ఆ మహమ్మారి ఏ వైపు నుంచి వెంటాడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో పక్క మనిషి తుమ్మినా, దగ్గినా అనుమానంతో కళ్లు పెద్దవి చేస్తారు.
అదే సమయంలో ఆసుపత్రికి వెళ్లామంటే పక్కా కరోనానే అని ఫిక్సయిపోతున్నారు. అలాంటిది కోవిడ్ సోకిన వ్యక్తి మీ దగ్గరకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది..? అది కూడా మాస్కు, సోషల్ డిస్టెన్స్ వంటి దూరం పాటించకుండా. ఈ విషయాన్ని తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుందని కదా.
undefined
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ పెట్రోల్ సంక్షోభం గురించి క్షేత్ర స్థాయిలో వివరిస్తున్నాడు. ముఖానికి మాస్క్ ఉన్నప్పటికీ దానిని తీసి మరి మాట్లాడుతున్నాడు.
ఈ సమయంలోనే అక్కడున్న ఓ వ్యక్తికి మైక్ అందించి పెట్రోల్ కొరత గురించి చెప్పమన్నాడు. మైక్ అందుకున్న ఆ వ్యక్తి ‘అవును ఇక్కడ పెట్రోలే దొరకడం లేదని చెప్పాడు. ఆ తర్వాత కూడా తన మాటలు కంటిన్యూ చేస్తూ.. ‘‘ నాకు కరోనా వుంది.. ఆసుపత్రికి వెళ్తున్నా’’ అని చాలా కూల్‌గా చెప్పాడు.
అంతే ఆ క్షణంలో ఆ జర్నలిస్టు గుండె ఆగినంత పనైంది. దీనికి తోడు ఆ కోవిడ్ బాధితుడు కూడా మాస్క్ ధరించకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపం ఆ రిపోర్టర్ పరిస్థితి ఏంటోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.