కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వధూవరులు, వివాహ అతిథులతో పాటు ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
జీవితంలో ఒక్కసారే వచ్చే వివాహ వేడుకను మధురానుభూతిగా.. మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. దీనికోసం అంగరంగ వైభవంగా, అట్టహాసంగా పెళ్లి వేడుకను చేసుకుంటారు. జిగేల్ మనే ఖరీదైన వస్త్రధారణ లేదా అద్భుతమైన పెళ్లి మండపం ఇలా ఏదో ఒక విధంగా వెరైటీగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే, ఈ కపుల్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. స్క్యై డైవింగ్ చేస్తూ పెళ్లి వేడుక పూర్తి చేశారు. వారిద్దరే కాదు తమతో పాటు అతిథులను కూడా స్క్యై డైవింగ్ చేయించారు. దీన్ని వారి పెళ్లికి వచ్చిన అతిథులు బహుశా ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వీడియో వైరల్ గా మారింది.
undefined
ఆచూకీ లేకుండా పోయిన క్రిప్టో ఇన్ ఫ్లుయెన్సర్ కథ విషాదాంతం.. సూట్ కేసులో ముక్కలుగా మృతదేహం...
ఈ వీడియోలో, ఒక వధూవరులు, వివాహ అతిథులతో పాటు ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ, సాహసం చేశారు. అయితే, వీరు.. వీరితో పాటు అతిథులూ దీన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా, ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్‌గా గుర్తించిన ఈ జంట కొండ అంచునుంచి దూకి.. తమ కొత్త జీవితంలోకి ప్రవేశించే వేడుకను ఉత్కంఠంగా ఉన్నారు. వివాహానికి హాజరైన వారందరికీ తగిన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో @lalibretamorada షేర్ చేసింది. ప్రిస్సిల్లా, ఫిలిప్పోలు ఇలా తమ వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. అల్లరిగి చేతులు పట్టుకుని.. సాహసంగా స్కై డైవింగ్ చేస్తూ.. వివాహ జీవితంలో రానున్న ఛాలెంజ్ లను ఎదుర్కోనున్నారు.. అంటూ దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ సాహసానికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఈ రకమైన వివాహ వేడుక అరుదు అంటూ థ్రిల్ అయ్యారు. మరికొందరు వారి ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే, ఇంకొందరు.. ''మరీ అతి చేశారు'' అన్నారు.
ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ''వావ్ ఇది నాకు చాలా నచ్చింది. నేను కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు చాలా భయం..హహహ... కొత్త దంపతులు అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వారికి అభినందనలు’’ అన్నారు.
మరొకరు, ''వావ్ వాళ్లు నేను చేయాలనుకున్నది వీరు చేశారు’’ అని వ్యాఖ్యానించారు. ఒకరేమో ''ఓ మై గాడ్ ఈ వీడియోను చూడగానే నేను భయపడ్డాను" అంటే మరొకరు ''ఇది చాలా ఎక్కువ!!'' అంటూ కామెంటారు.