భయానకం.. వ్యక్తి చొక్కాలోకి దూరిన నాగుపాము.. కదలనీయక, మెదలనీయక చుక్కలు.. వీడియో వైరల్...

Published : Jul 28, 2023, 10:51 AM ISTUpdated : Jul 28, 2023, 11:02 AM IST
భయానకం.. వ్యక్తి  చొక్కాలోకి దూరిన నాగుపాము.. కదలనీయక, మెదలనీయక చుక్కలు.. వీడియో వైరల్...

సారాంశం

ఓ పాము మనిషి షర్ట్ లోకి దూరి కాసేపు అతడికి చుక్కలు చూపించింది. పొట్ట దగ్గర తిరుగుతూ..ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో అతనికి నరకం కళ్లముందే కనిపించింది. 

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు  పాములు తేళ్లు రకరకాల విష కీటకాలు ఇళ్లల్లోకి వరద నీటితో పాటు వస్తుండడం మామూలైపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడక్కడ ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన తర్వాత పాములతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా  కురుస్తున్న వర్షాలతో  భూమి లోపలి బొరియాల్లో నీరు నిండిపోయి.. అందులో ఆవాసముంటున్న పాములు, విష కీటకాలు బయటికి వస్తున్నాయి.

కనిపించిన పొదల్లో, గడ్డిలో దాక్కుంటూ…అది వీలుకాకపోతే నీటిలో ఈదుతూ ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా…అలా వచ్చిన ఓ పాము ఓ వ్యక్తికి భయంకర అనుభవాన్ని మిగిల్చింది. అతని షర్ట్ లోకి దూరి  భయకంపితుడిని చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. 

Earthquake: అరుణాచల్ ప్రదేశ్ లో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత న‌మోదు

పాము తన చొక్కాలోంచి బయటికి వచ్చేంతవరకు అతడు కదలకుండా మెదలకుండా అలాగే కూర్చుండిపోయాడు. ఈ వీడియోకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. పార్కులా కనిపిస్తున్న ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టు కింద పడుకున్నాడు. అటుగా వచ్చిన కింగ్ కోబ్రా అతని షర్ట్ లోపలికి పోయింది. 

దెబ్బకు భయంతో ఆ వ్యక్తి వణికి పోయాడు. ఇది గమనించిన అక్కడున్న వ్యక్తులు అతని కాపాడడానికి ప్రయత్నించారు. అతడిని కదలకుండా ఉండాలని చెబుతూ… నెమ్మదిగా అతని షర్ట్ బటన్లు విప్పారు. ఆ పాము.. అతని కంటే ఎక్కువగానే భయపడ్డట్టుంది.. నెమ్మదిగా షర్ట్ లో నుంచి గడ్డిలోకి వచ్చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా పాకుతూ వెళ్లిపోయింది. 

ప్రాణాల అరచేతిలో పెట్టుకుని అప్పటివరకు అలాగే కూర్చున్న వ్యక్తి బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పాము తన చొక్కాలోకి ఎలా వచ్చిందో తెలియక తికమక పడుతున్నాడు. చుట్టూ చెట్లు, గడ్డి.. అడవిలాగా ఉండడంతో పాము వచ్చి ఉంటుందని  అక్కడున్నవారు అతడిని సముదాయించారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు.. మనకు కూడా ఒళ్ళు జలదరిస్తుంది. కాసేపు అతడి ప్లేసులో మనల్ని ఊహించుకొని తీవ్ర భయాందోళనకు లోనవుతాం.

 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్