బ్రెజిల్ ఫ్లైట్ క్రాష్ : విమానం నడిపిన 11యేళ్ల చిన్నారి.. బీర్ తాగుతూ సూచనలిస్తున్న తండ్రి.. షాకింగ్ వీడియో

By SumaBala BukkaFirst Published Aug 9, 2023, 12:30 PM IST
Highlights

బ్రెజిల్‌లో అడవుల్లో ఒక ప్రైవేట్ విమానం కూలిపోవడంతో.. అందులోని తండ్రీకొడుకులు మృతి చెందారు. దీని దర్యాప్తులో అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 

బ్రెజిల్ : బ్రెజిల్ ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి, అతని 11 ఏళ్ల కుమారుడు ఓ ప్రైవేట్ విమానంలో వెడుతూ.. విమానం కూలిపోవడంతో మృతి చెందారు. విమానం బ్రెజిల్ అడవుల్లో కూలిపోయింది. అయితే ఈ విషాద ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి కలవరపెడుతోంది. 

ఆ వ్యక్తి తన 11యేళ్ల కొడుకు విమానం నడపడానికి అనుమతించాడు. అతను బీర్ తాగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తండ్రీ కొడుకులిద్దరూ వారి ప్రైవేట్ విమానంలో ప్రయాణించేటప్పుడు 11 ఏళ్ల చిన్నారి విమానం నడుపుతున్నాడు. సదరు తండ్రి.. బ్రెజిలియన్ వ్యక్తి మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో ఆందోళనకరంగా మారింది. 

నేడు పాక్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న షెహబాజ్ షరీఫ్.. ఎందుకంటే ?

జూలై 29న బ్రెజిల్‌లోని అడవిలో వారి విమానం కూలిపోవడంతో తండ్రి గారన్ మైయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా మరణించారు. దీనికి కొద్ది క్షణాల ముందు ఈ వీడియో చిత్రీకరించబడిందని తెలుస్తోంది.  మైయా తన చిన్న కుమారుడుని విమానాన్ని నడపడానికి అనుమతిస్తూ  బీర్ బాటిల్‌ను చీర్స్ కొట్టడం కనిపిస్తుంది. అతను విమానాన్ని ఎలా ఆపరేట్ చేయాలో సూచనలు ఇవ్వడం, దాని నియంత్రణల గురించి అతనికి చెప్పడం చూడవచ్చు.

ప్రమాదానికి ముందు వీడియో తీశారా, విమానం కూలిపోయినప్పుడు విమానం నడుపుతున్నది కుమారుడేనా అని నిర్ధారించడానికి అధికారులు ఇప్పుడు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయినా కూడా కొడుకు, తన ఇద్దరి భద్రత పట్ల మైయా పూర్తిగా నిర్లక్షం వహించడానికి ఈ ఘటన హైలైట్ చేస్తుందని భావిస్తున్నారు.

స్థానిక బ్రెజిలియన్ మీడియా సమాచారం ప్రకారం, మైయా రొండోనియాలోని నోవా కాంక్విస్టాలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రం నుండి బయలుదేరాడు. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ఆగాడు. కొడుకును అతని తల్లి దగ్గర వదిలి పెట్టడానికి విమానంలో బయలుదేరాడు. మరోవైపు వీరిద్దరిమృతితో ఆగస్టు 1న తన భర్త, సవతి కొడుకు అంత్యక్రియలు చేసిన కొద్ది గంటలకే మైయా రెండో భార్య అనా ప్రిడోనిక్‌కు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది.

బ్రెజిలియన్ చట్టం ప్రకారం, హైస్కూల్ పూర్తి చేసి, నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీలో నమోదు చేసుకున్న 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే విమానం నడపడానికి అనుమతి ఉంటుంది. ఈ హృదయ విదారక సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది, కేసుకు సంబంధించిన అన్ని వివరాలను నిర్ధారించడానికి అధికారులు కృషి చేస్తున్నారు

click me!