ఏఐ ఎఫెక్ట్ : దేశీ వివాహ దుస్తుల్లో, వేడుకగా ఒపెన్‌హైమర్ తారాగణం.. కరణ్ జోహార్ సినిమాలా ఉందంటున్న నెటిజన్లు...

Published : Aug 02, 2023, 04:13 PM IST
ఏఐ ఎఫెక్ట్ : దేశీ వివాహ దుస్తుల్లో, వేడుకగా ఒపెన్‌హైమర్ తారాగణం.. కరణ్ జోహార్ సినిమాలా ఉందంటున్న నెటిజన్లు...

సారాంశం

భారతీయ వివాహ దుస్తుల్లో ఓపెన్‌హైమర్ తారాగణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఆ ఆలోచనకు జీవం పోశారు ఏఐ ఆర్టిస్టులు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓపెన్ హైమర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. అందులోని తారాగణం భారతీయ దుస్తుల్లో ఎలా ఉంటారో.. ఒక్కసారి ఊహించండి. ఆ ఊహను నిజం చేసేలా ఇండియన్ వెడ్డింగ్ దుస్తుల్లో ఓపెన్ హైమర్ తారాగణం ఉన్నట్టుగా సృష్టించారు ఏఐ ఆర్టిస్టులు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ ఏఐ ఆర్ట్ అకౌంట్, సైకాడెలిక్ ఆర్ట్ పేరుతో, సిలియన్ మర్ఫీ, రాబర్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్ లాంటి నటులు భారతీయ సంప్రదాయ వివాహ వస్త్రధారణలో ఎలా ఉంటారో రూపొందించి షేర్ చేశారు. 

ఎమిలీ బ్లంట్ ఎరుపు రంగు లెహంగాలో వధువులాగా కనిపించగా, ఫ్లోరెన్స్ కూడా అందమైన మరో లెహంగాలో కనిపించింది. గోల్డెన్ షేర్వానీలో సిలియన్ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఫోటోల సెట్‌లో రామి మాలెక్, మాట్ డామన్ కూడా కనిపిస్తారు.

“ఈ ఏఐ విజువలైజేషన్ ఓపెన్‌హైమర్ సినిమాలోని స్టార్ తారాగణం భారతీయ ఫంక్షన్‌లో ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలో నిమగ్నమై ఉన్నట్లుగా సృష్టించింది. అధునాతన కంప్యూటర్-సృష్టించిన ఇమేజరీ,స్పెషల్ ఎఫెక్ట్‌లను ఉపయోగించడం ద్వారా ఏఐ ఈ ప్రత్యేకమైన భావనను నిజంగా కనిపించేలా చేసింది” అని పోస్ట్ క్యాప్షన్ రాశారు. 

ఈ పోస్ట్ మీద నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఓపెన్‌హైమర్ కరణ్ జోహార్ సినిమాలా ఉందని అన్నారు.  క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఓపెన్‌హైమర్ లో అసాధారణమైన తారాగణాన్ని ఉన్నారు. ఇందులో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్ తో సహా అనేక ఇతర ప్రముఖ నటులు ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్
Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?