సమోసాలో బిర్యానీ.. ఇదెక్కడ చెత్త కాంబినేషన్..!

Published : Mar 29, 2023, 10:48 AM IST
 సమోసాలో బిర్యానీ.. ఇదెక్కడ చెత్త కాంబినేషన్..!

సారాంశం

ఆ స్టప్ కింద బిర్యానీని ఉపయోగించడం ఎప్పుడైనా విన్నారా..? ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఓ వ్యక్తి ఈ బిర్యానీ సమోసాను తయారు చేయగా.. ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.

సమోసాని ఇష్టంగా లాగించేవారు చాలా మందే ఉన్నారు. ఇక బిర్యానీ లవర్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కానీ... ఈ రెండింటినీ కలిసి తిన్నారా ఎప్పుడైనా..? ఈ రెండింటికీ కాంబినేషన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ప్రస్తుతం నెట్టింట బిర్యానీ సమోసా వైరల్ గా మారింది.

నిజానికి మనం సమోసా తయారీలో... లోపల స్టప్ కింద చాలా పదార్థాలను వాడతాం. కొందరు ఆలూ కర్రీ ఉపయోగిస్తారు. మరి కొందరు ఉల్లిపాయ కర్రీ, కొందరు క్యారెన్స్, మరి కొందరు స్వీట్ కార్న్ ఇలా రకరకాల కర్రీలను లోపల స్టప్ గా పెట్టి తర్వాత సమోసాను నూనెలో వేయించుతారు. అయితే... ఆ స్టప్ కింద బిర్యానీని ఉపయోగించడం ఎప్పుడైనా విన్నారా..? ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఓ వ్యక్తి ఈ బిర్యానీ సమోసాను తయారు చేయగా.. ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.

 

ఈ పోస్ట్ ఇప్పటికే 186k పైగా వ్యూస్ రాగా... వేలల్లో కామెంట్స్ రావడం విశేషం. కొందరు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉందని, చూడగానే టేస్టు చేయాలనే కోరిక కలుగుతోందంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి కొందరు మాత్రం... ఇలాంటి చెత్త ప్రయోగాలు చేసి జనాలను చంపకండి అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. మరి... ఈ సమోసాను చూడగానే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి..?
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్
Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?