నడుస్తూ తూళి కిందపడిపోయిన బైడెన్.. వీడియో వైరల్...

By SumaBala BukkaFirst Published Jun 2, 2023, 11:21 AM IST
Highlights

జో బైడెన్ మళ్లీ పడ్డారు. తూళి కిందపడి కాసేపటికి చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అమెరికా : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన తన చేష్టలతో తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఉన్నట్టుండి మరిచిపోతుంటారు. నడుస్తూ, నడుస్తూ కింద పడిపోతుంటారు. ఒకవైపు వెళ్ళాల్సింది మరోవైపుకు వెళుతుంటారు. ఆ మధ్య సైకిల్ మీద నుంచి కింద కూడా పడ్డారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఇది గురువారం నాడు జరిగింది. 

ఆరోజు  కొలరాడోలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బైడెన్ హాజరయ్యారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒకసారిగా తుళ్ళి ముందుకు పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. ఆ తరువాత బైడెన్  అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి చిరునవ్వులు చిందించారు. తుళ్ళిపడడంతో బైడెన్ కు ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదని..80యేళ్ల  అమెరికా అధ్యక్షుడు క్షేమంగానే ఉన్నాడని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ద్ ఓ ట్వీట్ లో తెలిపారు.

వీడి ప్రేమ తగలెయ్యా... కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు.. ఫ్రిజ్, టీవీ, సోఫాలు.. రాజవైభోగం...

ఆయన శారీరకంగా ఫిట్ గా ఉన్నారని, నిత్యం ఎక్సర్సైజులు కూడా చేస్తున్నారని ప్రకటించారు. కాగా అంతకుముందు 2020 నవంబరులో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కిందపడ్డారు. అప్పుడు కాలు విరిగింది. కానీ ఆ గాయం నుంచి అతను త్వరగానే కోరుకున్నారు. అయితే దీని మీద మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.  అమెరికా అధ్యక్షుడైన  బైడెన్ మానసికంగానే కాదు ఇప్పుడు శారీరకంగా నడవడానికి కూడా కష్టంగానే ఉన్నారన్నారు.

అమెరికా రక్షణ కోసం అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను.. అంటే అధ్యక్ష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం.. అనే సవరణను తెరమీదికి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రీట్ చేశారు. కాదా బైడన్ కింద పడడం కొత్తేం కాదంటూ కొంతమంది సరదాగా సెటైర్లు వేస్తుండగా.. మరి కొంతమంది వయసు పైబడిన వ్యక్తి కదా ఇలాంటివి సహజమే అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

 

https://twitter.com/bennyjohnson/status/1664344646854516738?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1664344646854516738%7Ctwgr%5E4c5b26c9d2c57f8b8003549845bf1eb697926c96%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fbiden-falls-us-air-force-academy-graduation-ceremony-viral-1643001

click me!