ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్క కోసం ఓ ఖరీదైన ఇంటిని నిర్మించాడు. దీనికోసం రూ.16 లక్షలు ఖర్చుపెట్టాడు. టీవీ, ఫ్రిడ్జ్.. సోఫాలు.. ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాడు.
కాలిఫోర్నియా : పెంపుడు కుక్కల మీద యజమానుల కురిపించే ప్రేమను అసలు ఊహించలేం. వాటికోసం ఎన్నో చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు ఓ కుర్రాడు. తన ప్రియాతి ప్రియమైన పెంపుడు కుక్క కోసం.. అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించాడు. ఇంటి ముందు లాన్లో.. కుక్కల కోసం డాగ్ హౌస్ ఏర్పాటు చేయడం మామూలుగా చూస్తుంటాం.. కానీ ఇతడు ఏకంగా 20వేల డాలర్లు పెట్టి అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించాడు. ఇంట్లో తన శునకం కోసం.. కుర్చీలు, సోఫాలు, బీన్ బ్యాగులు, ఫ్రిడ్జ్, టీవీ.. బంక్ బెడ్.. ఇలాంటి సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశాడు.
వింటుంటే ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదా.. కానీ ఇది నిజంగా జరిగింది. ఈ వింత ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. యూట్యూబర్ గా పని చేస్తున్న 25 ఏళ్ల బ్రెంట్ రివెరా అనే యువకుడు.. తన కుక్క చార్లీ కోసం ఈ లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా దాని మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. సహజంగానే అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ చక్కటి వీడియో తీసి సోషల్ మీడియాలో.. తన అకౌంట్లో పోస్ట్ చేశాడు.
undefined
తాను ఎంతగానో ప్రేమించే తన మొదటి పెంపుడు కుక్క చనిపోయిందని.. ఆ తరువాత చార్లీని పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. మొదట చార్లీ కోసం కార్డు బోర్డులతో చిన్న ఇల్లు నిర్మించారు. ఆ తర్వాత దాన్ని మొదటి బర్త్డే సందర్భంగా విలాసవంతమైన ఇంటిని నిర్మించాలనుకున్నాడు. దీనికోసం స్నేహితుడి సహాయంతో.. 20వేల డాలర్లు అంటే దాదాపుగా ఆరు రూ. లక్షలు పెట్టి ఖరీదైన ఇంటిని నిర్మించాడు.
ఈ ఇంట్లో మెత్తటి విలాసవంతమైన బెడ్, కాఫీ టేబుల్, ఫ్రిడ్జ్, టీవీ.. బీన్ బ్యాగ్.. లాంటి సౌకర్యాలు అన్ని అమర్చాడు. కుక్క టీవీ చూస్తుందా అంటే.. అందులో కేవలం దానికి నచ్చేవి ఎప్పుడు ప్లే అయ్యేలా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఇంటి బయట బంగారు అక్షరాలతో చార్లీ హౌస్ అని రాయించాడు. దాని కింద ఓ సింబల్ కూడా ఏర్పాటు చేశాడు. కుక్కకు సంబంధించిన అన్ని సౌకర్యాలను, వస్తువులను ఇంట్లో ఏర్పాటు చేశాడు.
ఆ తర్వాత.. చార్లీ ని తీసుకువచ్చి.. ఆ కొత్త ఇంట్లోకి సర్ప్రైజ్ గా పంపించాడు. అది ఎగ్జైట్ అవుతుంటే చూసి.. సంబరపడిపోయాడు. దానికి కొత్త ఇల్లు నచ్చిందంటూ ఎగిరికి గంతులేసాడు. ఇదంతా నెట్టింట్లో పెట్టడంతో.. చూసినవారు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఓ కుక్కకు ఇంత ఖరీదైన ఇంటిని నిర్మించడం మీద.. అతని ప్రేమ మీద.. కొంతమంది ప్రశంసలు కురిపించగా… మరి కొంతమంది మాత్రం.. స్వేచ్ఛగా తిరిగే జీవిని.. బంధించి.. మనుషుల్లా వాటిని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారంటూ విమర్శించారు.