వీడియో: అల్లుడి కోసం 67 రకాల వంటలు... ఎంత అదృష్టవంతుడో..!!

Siva Kodati |  
Published : Jul 09, 2020, 07:43 PM ISTUpdated : Jul 09, 2020, 09:10 PM IST
వీడియో: అల్లుడి కోసం 67 రకాల వంటలు... ఎంత అదృష్టవంతుడో..!!

సారాంశం

ఇంటికి వస్తున్న అల్లుడిగారి కోసం ఏకంగా 67 రకాల వంటల్ వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

సాధారణంగా కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే ఆ అత్తగారింట్లో హడావిడి మామూలుగా ఉండదు. కొత్త బట్టలు, కానుకలతో పాటు పిండి వంటలతో అదరగొట్టేస్తారు. కాస్త కలిగిన వాళ్లయితే ఇంకొంచెం ఎక్కువ వండి పెడతారు.

కోస్తా జిల్లాల్లో ఈ సందడి బాగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఓ అత్తగారు ఇటీవల పెళ్లైన తన కూతురు, ఆమె భర్త (అల్లుడు) కోసం తమ పద్ధతిలో మర్యాద చేయాలనుకున్నారు.

దీనిలో భాగంగా ఇంటికి వస్తున్న అల్లుడిగారి కోసం ఏకంగా 67 రకాల వంటల్ వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనంత్ రూపనగుడి అనే ట్విట్టర్ యూజర్ గురువారం షేర్ చేశాడు.

ఈ 67 రకాల వంటకాల్లో చాట్స్, స్వీట్స్, వెల్‌కం డ్రింక్, మెయిన్ కోర్స్, స్నాక్స్‌తో పాటు డిసెర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోకు ఇప్పటి వరకు 68 వేలకు పైగా వ్యూస్ రాగా, వందల్లో కామెంట్స్ వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్