కోతులకున్న జ్ఞానం మనిషికి లేకుండాపోయింది: ఎందుకో ఈ వీడియో చూడండి

By Siva KodatiFirst Published Jul 9, 2020, 6:29 PM IST
Highlights

కరోనా వైరస్ ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు. అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇలాంటి సమయంలో మనుషుల కంటే జంతువులే బెటరేమో అనిపిస్తుంది

కరోనా వైరస్ ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు. అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇలాంటి సమయంలో మనుషుల కంటే జంతువులే బెటరేమో అనిపిస్తుంది.

కరోనా బారినపడకుండా ఉండాలంటే మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, ఓ కోతి మాత్రం తన సేఫ్ కోసం మాస్కు ధరించాలని నిర్ణయించుకుంది. అంతే రోడ్డు మీద దొరికిన ఓ టవల్‌ను ముఖానికి చుట్టుకుంది.

పాపం.. అది ముక్కు, నోటీనే కాకుండా కళ్లను కూడా మూసేసుకుని ఇబ్బంది పడింది. ఐఎఫ్ఎస్‌ అధికారి సశాంతా నందా పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇటీవల మనుషుల రూపాలు మారిపోయాయని కోతులకు కూడా తెలిసిపోయింది.

ముఖానికి మాస్కులు, రుమాళ్లు కట్టుకుని తిరుగుతున్నారని భావించిన ఆ కోతి.. తన ముఖానికి కూడా ఆ టవల్ కట్టుకుంది కాబోలు అని నెటిజన్స్ అంటున్నారు. అయితే, అది ముఖం మొత్తం టవల్‌తో చుట్టేసుకోవడం చూసి అంతా తెగ నవ్వేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

After seeing head scarfs being used as face mask😊😊 pic.twitter.com/86YkiV0UHc

— Susanta Nanda IFS (@susantananda3)
click me!