షారూక్ పాటకు.. అమెరికా దంపతుల అదిరిపోయే డ్యాన్స్..!

Published : Aug 31, 2021, 01:56 PM ISTUpdated : Aug 31, 2021, 01:59 PM IST
షారూక్ పాటకు.. అమెరికా దంపతుల అదిరిపోయే డ్యాన్స్..!

సారాంశం

అమెరికన్ రీకీపాండ్.. తన 25వ పెళ్లి రోజు సందర్బంగా భార్యతో కలిసి ఆనందంగా స్టెప్పులు వేశాడు. చమ్మక్ చల్లో పాటకు ఆయన వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 


ఈ అమెరికన్ ని గుర్తు పట్టారా.. గతంలో.. భోజపూరీ పాట లాలీపాప్ లాగేలు, తెలుగులో అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఈసారి.. మరో పాటతో మన ముందుకు వచ్చాడు. ఈ సారి బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన రావన్ సినిమాలోని చమ్మక్ చల్లో పాటకి అదరగొట్టాడు. అయితే.. ఈ సారి తన భార్య తో కలిసి స్టెప్పులు వేయడం గమనార్హం. 

అమెరికన్ రీకీపాండ్.. తన 25వ పెళ్లి రోజు సందర్బంగా భార్యతో కలిసి ఆనందంగా స్టెప్పులు వేశాడు. చమ్మక్ చల్లో పాటకు ఆయన వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  ఇతనిని అందరూ డ్యాన్సింగ్ డాడ్ అంటూ నెట్టింట ముద్దుగా పిలుచుకుంటున్నారు.

కాగా.. వీరు మన ఇండియన్ పాటలకు డ్యాన్స్ వేయడం మాత్రమే కాదు..  భారత సంప్రదాయానికి సంబంధించిన దుస్తులు ధరించడం విశేషం. రికీ పాండ్ కుర్తా పైజామా ధరించగా.. అతని భార్య కుర్తా, గాగ్రా ధరించారు. ఈ వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి.. చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. కావాలంటే ఆ వీడియో పై మీరు కూడా ఓ కన్నేయండి.

 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్