రంగు రంగుల పాము... ఈ రెయిన్ బో స్నేక్, 50ఏళ్ల తర్వాత మళ్లీ..

By telugu news team  |  First Published Feb 24, 2020, 8:58 AM IST

ఇటీవల ఫ్లోరిడాలో ఈ పాము కనువిందు చేసింది. ఫ్లోరిడా ఫిష్, వైల్డ్ లైఫ్ పరిశోధనా కేంద్రం ఫేస్ బుక్ లోతెలిపిన వివరాల ప్రకారం.. ట్రెసీ కాథెన్ అనే వ్యక్తి ఇటీవల ఒకాలా జాతీయ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ విభిన్న రంగుల్లో ఉన్న నాలుగు అడుగుల పొడవైన పాము కనిపించింది.
 
ఇప్పటి వరకు మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు. అయితే... ఇలాంటి పాముని మాత్రం చూసి ఉండరు. పాముల్లో చాలా రకాల రంగులు కూడా చూసి ఉంటారు. అయితే.. రంగురంగుల పాముని ఎప్పుడైనా చూశారా.. అదే రెయిన్ బో స్నేక్.  అరుదైన జాతికి చెందిన పాము దాదాపు 50 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమైంది.

Latest Videos

undefined

ఇటీవల ఫ్లోరిడాలో ఈ పాము కనువిందు చేసింది. ఫ్లోరిడా ఫిష్, వైల్డ్ లైఫ్ పరిశోధనా కేంద్రం ఫేస్ బుక్ లోతెలిపిన వివరాల ప్రకారం.. ట్రెసీ కాథెన్ అనే వ్యక్తి ఇటీవల ఒకాలా జాతీయ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ విభిన్న రంగుల్లో ఉన్న నాలుగు అడుగుల పొడవైన పాము కనిపించింది.

వెంటనే అతను తన కెమేరాలో ఆ పామును బంధించాడు. ఆ ఫోటను చూసిన నిపుణులు.. దానిని రెయిన్ బో స్నేక్ గా గుర్తించారు. ఫ్లోరిడాలో దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ పాము ఉండేదని.. మళ్లీ ఇప్పుడు ఇలా కనపడిందని వారు చెబుతున్నారు. ఈ పాముకి విషం ఉండదని చెప్పారు. ఇది ఒక జలచర జీవి అని.. ఎక్కవగా నీటిలో సంచరిస్తూ ఉంటాయని చెప్పారు. 

click me!