ఇటీవల ఆమెకు నిజమైన ప్రేమ దక్కిందట. కరోనా మహమ్మారి సమయంలో.. తనకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడని.. ఆమె ట్విట్టర్ లో పేర్కొంది. కాగా.. ఆమె ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బామ్మ ప్రేమ కథలోకి వెళితే...
ప్రేమకు వయసుతో పనేముంది. ఈ వయసులోనే మనసులో ప్రేమ పుట్టాలి అని రూల్ ఎక్కడా లేదు. మన మనసుకు నచ్చిన వ్యక్తి.. ఏ వయసులో అయినా మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓ 73ఏళ్ల బామ్మ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల ఆమెకు నిజమైన ప్రేమ దక్కిందట. కరోనా మహమ్మారి సమయంలో.. తనకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడని.. ఆమె ట్విట్టర్ లో పేర్కొంది. కాగా.. ఆమె ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బామ్మ ప్రేమ కథలోకి వెళితే...
అమెరికా కు చెందిన కార్ల్ హెచ్. మ్యాక్ అనే మహిళ ఇటీవల ప్రేమలో పడింది. అయితే.. అప్పటికే ఆమెకు పెళ్లైపోయింది. ఈ ప్రేమ కోసం ఆ పెళ్లి బంధాన్ని ఆమె తుంచుకోవడం గమనార్హం. అలాగే ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఈ విషయాన్ని కార్ల్ హెచ్ . మార్క్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జీవితం చాలా విచిత్రమైనది. దాదాపు నాలుగు దశాబ్ధాల పెళ్లి జీవితాన్ని తెంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక సింగల్ గా మారాను.
Life is so strange. After nearly four decades of marriage, I never expected to be single again at 70. And I certainly didn’t expect to find true love at the age of 73 in the middle of a pandemic! And now this! pic.twitter.com/HszN0zj9pr
— Carol H. Mack (@AttyCarolRN)
అలాగే ఊహించని ప్రేమకు దగ్గర అవుతున్నాను. అంటూ తన ఎంగేజ్ మెంట్ రింగ్ తో ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ ట్వీట్ పోస్టు చేసి మూడు, నాలుగు రోజులు అవుతోంది. అయితే.. వాలంటైన్స్ డే రోజున ఈ ట్వీట్ మరింత వైరల్ గా మారడం గమనార్హం. ప్రేమ కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బామ్మ తన కథతో.. ప్రేమకు వయసు లేదు అని మరోసారి రుజువు చేసింది.