ఈ బామ్మ కూడా.. తమ కాలంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవారో ఆమె మాట్లాడి వినిపించింది. దాదాపు 36 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఈ కాలం వారు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా కామన్. కానీ... ఓ బామ్మ దాదాపు 80ఏళ్లు పైనే ఉంటాయి. ఆమె ఇంగ్గీష్ అదరగొట్టేసింది. అయితే.. ఆమె మాట్లాడిన ఇంగ్లీష్.. మామూలుగా మనం ఇప్పుడు మాట్లాడే ఇంగ్లీష్ లా లేదు. ఇంగ్లీష్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఇంగ్లీష్ మాట్లాడతారు. వారు పదాలను పలికే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బామ్మ కూడా.. తమ కాలంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవారో ఆమె మాట్లాడి వినిపించింది. దాదాపు 36 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఆమె కశ్మీర్ కి చెందిన మహిళ కాగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాత రోజుల్లో ఇంగ్లీష్ భాష ఎలా ఉండేది.. పలు ప్రాంతాల్లో జనం ఇంగ్లీష్ పదాల్ని ఎలా ఉచ్చరించేవారు అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్‌కు పాతకాలంలో మాట్లాడే ఇంగ్లీష్‌కు చాలా వ్యత్యాసం ఉండేది.
The circle of life ! 💜
They taught us how to talk when we were babies and how the turntables ! What is even more wholesome is that learning is a consistent process in life ! 💫 pic.twitter.com/NxQ7EHjAwZ
undefined
గతంలో వివిధ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ను వివిధ రకాలుగా ఉచ్చరించేవారు. తాజాగా కశ్మీర్‌కు చెందిన ఒక బామ్మ మాట్లాడిన ఇంగ్లీష్ పదాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పలు పదాలను కశ్మీరీ ఇంగ్లీష్ యాసలో ఈ బామ్మ ఉచ్చరించిన తీరు ఆకట్టుకుంటోంది. సయ్యద్ స్లీత్ షా అనే ఆయన ముప్పై సెకన్లు ఉన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బామ్మ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అదిరిపోయిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. కావాలంటే మీరు కూడా వినేయండి.