భలే ఉందే...ఆధార్ కార్డ్ రూపంలో వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్...

By SumaBala Bukka  |  First Published Feb 7, 2022, 1:08 PM IST

ఇప్పుడు ట్రెండ్ మారింది.  యూత్ కొత్త తరహాలో ఆలోచిస్తోంది. అలా తాజాగా, ఛత్తీస్గఢ్ లోని యశ్ పూర్ జిల్లా, ఫర్ సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ తన వెడ్డింగ్ కార్డును రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


జష్‌పూర్ : Chhattisgarhలోని జష్‌పూర్ జిల్లాలో ఓ గిరిజన యువకుడి విచిత్ర Wedding Invitation card వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ కార్డ్ దేశవ్యాప్తంగా Social mediaలో వేగంగా Viralగా మారుతోంది. వెడ్డింగ్ కార్డ్‌లోని ముఖ్యాంశాలు మొత్తం Aadhaar card రూపంలో ప్రింట్ చేశారు. దీంతో పాటు.. కార్డు వెనకభాగంలో ఆధార్ కార్డు సమాచారం ఉండే ప్రాంతంలో.. Corona virus మహమ్మారిని నివారించడానికి అవసరమైన నియమాల గురించి రాసుకొచ్చారు. అంతేకాదు ఈ ఆహ్వాన పత్రికలో ఆధార్ కార్డ్ నంబర్ స్థానంలో పెళ్లి తేదీని ప్రింట్ చేశారు. 

ఈ ప్రత్యేక కార్డును, వినూత్నంగా రూపొందించిన వివాహ ఆహ్వాన పత్రంను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతున్నారు. యువజన సంఘంలోని వారైతే ఈ పత్రికను తమ స్నేహితులకు పంపి, వారినీ ఫార్వర్డ్  చేయవలసిందిగా కోరుతున్నారు. ఇక ఈ కార్డు రూపకర్త, పెళ్లి కొడుకు ఎవరంటే.. అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింగ్. కరోనా మహమ్మారి సమయంలో అతనికి చేదు అనుభవాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదం ఎవ్వరికీ రావొద్దని.. అందరూ సురక్షితంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ కార్డును ఇలా రూపొందించాడట. 
 
లోహిత్ సింగ్ తన గ్రామంలో ఇంటర్నెట్, పెళ్లి కార్డు ప్రింటింగ్, ఇతర కంప్యూటర్ సంబంధిత పనులు చేస్తుంటాడు. దీంతో తన పెళ్లికి కొత్తరకంగా ఆలోచించాలనుకున్నాడు. దీనికోసం కొత్తరకంగా పెళ్లి పత్రికను డిజైన్ చేశాడు. ఈ కార్డును చూసిన, జష్‌పూర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ అధ్యక్షురాలు హేమ శర్మ బాగా మెచ్చుకున్నారు. కరోనా నుండి కాపాడుకోవడానికి ఈ వివాహ ఆహ్వాన లేఖలో చాలా మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పాటు గ్రామంలోని యువకులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంచి చొరవ చూపారన్నారు.

Latest Videos

ఆ పెళ్లి కొడుకు...చూడగానే ఆధార్ కార్డులాగా కనిపించేలా తన పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి బంధువులు, మిత్రులు పంచాడు.  తమ పెళ్లికి వచ్చే వారంతా ముఖానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని... పేర్కొన్నాడు. ఇక బార్ కోడ్ సైతం ఉన్న ఈ కార్డులో ఆధార్ నెంబర్ స్థానంలో పెళ్లి తేదీ.. ఆ కింద స్థానంలో ఆచరించాల్సిన నియమాలు పొందుపరిచాడు. ఏదైనా కొత్తగా కనిపిస్తే వైరల్ చేసేదాకా ఊరుకోని నెటిజన్లు.. ఇప్పుడు ఆధార్ కార్డును పోలి ఉన్న వెడ్డింగ్ కార్డును తెగ వైరల్ చేస్తున్నారు. 

click me!