దేవుడే అడ్డొచ్చినా రాజధానిని మారుస్తాం... ఎంపీ విజయసాయిపై టిడిపి ఎమ్మెల్సీ ఫైర్

By Arun Kumar PFirst Published Jan 29, 2020, 5:44 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనో లేక విజయసాయి రెడ్డో అర్థంకాక రాష్ట్ర ప్రజలు కన్ప్యూజన్ కు గురవుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సెటైర్లు విసిరారు. 

విజయవాడ: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని.... సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బచ్చుల ఆర్జునుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  ఉద్యమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

రాష్ట్ర రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఏర్పాటుచేసిన ఏ కమిటీ కూడా వాస్తవాలు చెప్పలేదన్నారు.  రిపోర్ట్ లో విశాఖపట్నం అనువైన ప్రదేశం కాదు అని చెప్పే కవర్ పేజీ తీసేసారని ఆరోపించారు. స్వార్ధ  ప్రయోజనం కోసం మాత్రమే మూడు రాజదానులను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు.

ఉన్నభూములలో రాజదాని కట్టడం చేతగాక విశాఖపట్నంలో భూసేకరణ చేస్తున్నారని అన్నారు. ఆ దేవుడు అడ్డు వచ్చినా విశాఖపట్నంలో రాజదాని ఏర్పాటు చేస్తామని ఎంపీ
 విజయసాయి రెడ్డి  చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర  ప్రజలకు అసలు ముఖ్యమంత్రి ఎవరు అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి  చేష్టల వలన కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారని అన్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించడానికి ముఖ్యమంత్రే ప్రధాన కారకుడని  అర్జునుడు ఆరోపించారు. 

read more  మంత్రి పదవికి రాజీనామా చేస్తాం... ఎప్పుడంటే..: మోపిదేవి

వృద్ధులకు 3 వేలు పెన్షన్ ఇస్తామని 250 మాత్రమే పెంచారని... రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలోనూ మాటమార్చారని అన్నారు. అలాగే అమ్మవడి పథకంలో కూడా ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సహజ వనరు ఇసుకను లూటీ చేస్తున్నారని...  పెరిగిన ఇసుక ధరలు ఎవరి జోబులోకి వెళుతున్నాయని నిలదీశారు.

రాజదాని అమరావతిని గతంలో స్వాగతించి ఇప్పుడు రాజదాని మారుస్తూ మాటమార్చడమంటే మడమతిప్పడం కాదా అని జగన్ ను ప్రశ్నించారు. రాబోయే స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రజలు చెప్పే తీర్పుతో ఆయన సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.  ప్రజాక్షేత్రంలో జగన్ బండారం బయటపడుతుందని అన్నారు. 

read more  ''వైఎస్ వివేకా హత్య కేసులో సునీత చిక్కులు: హైదరాబాద్ కు రహస్యంగా జగన్''

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు జగన్ సిబిఐ విచారణ జరిపించాలని కోరారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సిబిఐని ఎందుకు వేయలేదన్నారు. వైఎస్ వివేకా కుమార్తె సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని... ఆమె అభ్యర్ధనను మన్నించాలన్నారు. ఆ కేసులో అసలు దోషులను వదిలి అమాయకులను విచారణ చేస్తున్నారని అర్జునుడు తెలిపారు. 

click me!