రాష్ట్రం లో రివర్స్ టెండరింగ్ పేరుతో రియాలిటీ షో నడుస్తుందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ఐదు సంవత్సరాల్లో 73 వేల 622 కోట్ల రూపాయల పనులు నడిచాయని గుర్తు చేశారు.
రాష్ట్రం లో రివర్స్ టెండరింగ్ పేరుతో రియాలిటీ షో నడుస్తుందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ఐదు సంవత్సరాల్లో 73 వేల 622 కోట్ల రూపాయల పనులు నడిచాయని గుర్తు చేశారు.
నాలుగు నెలల పాలన గురించి వైసీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని.. ఇంతవరకు ఒక బొచ్చెడు సిమెంట్ వేయలేదు..ఒక తట్ట మట్టి ఎత్తలేదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయని.. ఈ నాలుగున్నర నెలల్లో పెండింగ్ బిల్స్ ఎవరెవరికి ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా అంటూ దేవినేని ప్రశ్నించారు.
undefined
బోటు మునిగి నెలా ఐదు రోజులు అయితే రాష్ట్రం మునిగి నాలుగు నెలలు అయిందని వ్యాఖ్యానించారు. గోదావరి గర్భం లో 300 అడుగుల లోతులో కొండరాయిని పట్టుకుని డయాఫ్రమ్ వాల్ కట్టామని ఉమా గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేయటమే సరిపోతుందని.. కానీ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం సీఎం కి లేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతు భరోసా పధకం కింద వచ్చే డబ్బులు రైతుల అకౌంట్ లో జమ కావటం లేదని... డబ్బులు పడనప్పుడు మళ్ళీ మెసేజ్ లు ఎందుకని ఉమా ప్రశ్నించారు.
ప్రభుత్వ దుకాణాల్లో రాత్రి 8 తరువాత వైసీపీ కార్యకర్తలు లిక్కర్ అమ్ముతున్నారని.. ఇవన్నీ మాట్లాడకుండా ఉండాలనే జీవో నెంబర్ 938 తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధ వర్ణనాతీతమని.. మీ కనుసన్నల్లో వేలాది ఇసుక లారీలు హైద్రాబాద్,బెంగళూరు వెళ్తున్నాయని ఉమా ధ్వజమెత్తారు.
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. "జగన్ అనే నేను అంటూ కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి.
విశాఖలో వచ్చేనెల 3న పవన్ కళ్యాణ్ ర్యాలీ: జనసేన నిర్ణయాలివే
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని ఆనాడు చెప్పారు. మరిప్పుడు ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? అంటే కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా? అయినా తెదేపా హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసాం" అంటూ ట్విటర్ వేదికగా ఆరోపించారు.