tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

By sivanagaprasad KodatiFirst Published Oct 20, 2019, 6:10 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడి గుండె ఆగిపోయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడి గుండె ఆగిపోయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

గత 15 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆయన పాల్గొన్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఆవేదనతో ఆయన చనిపోయారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల తెలంగాణ ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం ఉద్యోగం లేక సొంతింటికి చేసిన అప్పు తీరుతుందో లేదోననే మనస్తాపంతో హైదరాబాద్ 49M రూట్ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ గౌడ్ హైదరాబాద్ రాణి గంజ్ ఆర్టీసీ డిపో టూ లో పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని కార్వాన్ లోని ఇంట్లో  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రాంచందర్ రావు లు సందర్శించారు. 

హెచ్‌సీయూ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం

సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, పోలీసులు అతనిని అడ్డుకుని కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసి సమ్మె: అప్పు తీరుతుందో లేదన్న బెంగతో... (వీడియో)

ప్రస్తుతం సందీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ సాక్షిగా పోలీసులు అంతా చూస్తుండగానే మరో ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

వెంటనే స్పందించిన తోటి కార్మికులు, రాజకీయ నేతలు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా ఖమ్మంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 

click me!