తెలుగు అవసరమే..కానీ తెలుగు మాధ్యమం కాదు...: ప్రొ. కంచ ఐలయ్య

By Arun Kumar PFirst Published Nov 27, 2019, 3:32 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు విద్యను అందించాలని తీసుకున్న నిర్ణయంపై వివాదం కొనసాగుతున్న విషయం  తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాస్పద రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య దీనిపై స్పందించారు.  

విజయవాడ: భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుండే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్నఏపి సర్కార్ నిర్ణయంపై వివాదాస్పద రచయిత, ప్రొపెసర్ కంచె ఐలయ్యా స్పందించారు. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో మార్పు కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశంసించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా తన తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఐలయ్య వెల్లడించారు. 

విజయవాడలోని హోటల్ ఐలపురంలో ''పేద ప్రజలు- ప్రభుత్వం ఆంగ్ల విద్య'' అనే అంశంపై జరిగిన సదస్సులో కంచె ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో ఇప్పటివరకు ధనవంతులు, అగ్ర కులాల వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని అన్నారు. నిరుపేదలు, నిమ్న వర్గాలు ఇంకా తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థాయికి చేరుకోలేదన్నారు. 

ఇలాంటి వారు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాష మాధ్యమంలోనే తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారని అన్నారు. అలాంటిది ఉన్నత వర్గాలతో సమానంగా పేద కుటంబాలకు చెందిన విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ ను దగ్గరచేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పదని...  ఆంగ్ల మాధ్యమంను వ్యతిరేకించే వారు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. 

READ MORE  టాయిలెట్లు లేని సెక్రటేరియట్... నారాయణ కాలేజీల్లా బిల్డింగులు: అమరావతిపై పేర్ని నాని కామెంట్స్

విద్యారంగంలో, సమాజంలో మార్పు ఆపడానికి మేధావి వర్గం ఆంగ్లంతో పాటు మాతృ భాష మీడియం ఒక సెక్షన్ ఉండలంటున్న  విషయాన్ని గుర్తుచేశారు. ఇదే మేధావి వర్గం ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఈ సెక్షన్ ఎందుకు ఉండాలని మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. 

ఎస్సి ఎస్టీ వర్గాలను అణచివేయడానికి తెలుగులోనే భోదించాలని అంటున్నారని ఈ సదస్సు ద్వారా చెప్తున్నానని.. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు తెలుగు మాధ్యమం అవసరం లేదని ఐలయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ఆంగ్లంలో భోదించడానికి సిద్ధమవ్వాలని సూచించారు.  ఆంగ్లం చాలా సులభంగా నేర్చుకునే భాష అని... దాన్ని చూసి భయపడవద్దని ధైర్యం చెప్పారు. మొదట ఉపాధ్యాయులు  ఆ తర్వాత విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని సూచించారు. 

READ MORE  స్థానికులకే మొదటి ప్రాధాన్యత...అందుకోసమే ప్రత్యేక చట్టం: అవంతి

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పార్టీ పేరే తెలుగుదేశం కదా ఆంగ్ల మీడియం ఎలా ప్రవేశపెడతారని అన్నారని గుర్తుచేశారు. కానీ ఆయన పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారని ఐలయ్య ప్రశ్నించారు.

ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గ్రామాల్లో ఆంగ్ల మీడియం వస్తే ఒక్కో విద్యార్థి ఐన్స్‌టిన్ లాగా తయారై మంచి మేధావులు బయటకు వస్తారన్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో సహా చాలామంది  ఆ పార్టీ అగ్ర నాయకులు ఇంగ్లీష్ లో చదువుకున్నారని అన్నారు. అంబెడ్కర్ వారసులమైన తమకు ఇంగ్లీష్ మీడియంపై ఎలాంటి వ్యతిరేకత లేదని...ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకిస్తే చీపురు కట్టలు పట్టుకుని వస్తారని ఐలయ్య హెచ్చరించారు. 

click me!