ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కిడ్నాప్ గురయిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడ: ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కిడ్నాప్ గురయిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం ఐదుగంటల్లోనే కిడ్నాపర్ ను గుర్తించి అతడి చెరనుండి చిన్నారిని కాపాడారు.
ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ఇవాళ ఉదయం కిడ్నాప్ కు గురయ్యింది. దీంతో బాలిక తల్లి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
undefined
read more కృష్ణా జిల్లాలో కిరాతకం... టిడిపి ఎంపిటీసి అభ్యర్థి దారుణ హత్య
అయితే చిన్నారి తండ్రి స్నేహితుడిపై అనుమానంతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆదారంగా ఎక్కడున్నాడో గుర్తించారు. అతడు విజయవాడలో వున్నట్లు తెలుసుకుని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వారు అతడున్న చోటికి వెళ్లగా చిన్నారి కూడా అతడితోనే వుంది. దీంతో కిడ్నాపర్ చందుని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
ఇలా కేవలం ఐదు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు నందిగామ పోలీసులు. దీంతో వారిని నందిగామ ప్రజలే కాదు ఉన్నతాధికారులు కూడా అబినందించారు. ఇక కూతురు తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.