టిడిపిలో సన్నాసి నాయకులు...: కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 14, 2019, 3:07 PM IST
Highlights

ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఆ పార్టీలో వున్న సన్నాసి నాయకులే ఇలా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. 

శ్రీకాకుళం: ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలో కొంతమంది సన్నాసి నేతలున్నారని... అలాంటివారే తమ ప్రభుత్వం, నాయకులు జగన్ పై వివర్శలు చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి, కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుపేద ప్రజలకు మెరుగైన విద్య అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అలాంటి నాయకులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివించేవారు పేద ప్రజల విషయంలో అలా జరగడాన్ని ఇష్టపడటం లేదన్నారు. అందువల్లే నీతులు చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని వ్యతిరకిస్తున్నారని మండిపడ్డారు. 

బ్రీఫ్డ్ మీ చంద్రబాబుకు చెందిన హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలు ఇంగ్లీషు మీడియంకి చెందినవి కాదా...? అని  ప్రశ్నించారు. అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా... ఇలాంటివారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారా...? అని ప్రతిపక్ష పార్టీల అధినేతలపై ప్రశ్నలు సంధించారు.

read more  పెళ్లిల్లు, పెళ్లాలపై కాదు... సమస్యల పరిష్కారంపై మాట్లాడాలి...: జగన్ కు ఉండవల్లి చురకలు

రాష్ట్రంలో 45 వేల పాఠశాలలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.33 వేల కోట్లు కేటాయించామన్నారు.  ఇలా మౌళిక సదుపాయల అభివృద్దితో పాటు బోధనలో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించామని...గ్లోబలైజేషన్ లో ఇంగ్లీషు అవసరం చాలా వుందని మంత్రి పేర్కొన్నారు.

 రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ.... విద్యార్థుల జీవితం బాగుపడాలనే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని యోచించినట్లు తెలిపారు. అంతేగానీ మాతృభాష  తెలుగును అవమానించాలని గానీ నిర్లక్ష్యం చేయాలని గానీ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని క్రిష్ణ దాస్ వివరించారు.

read more   ప్రజల దృష్టి మరల్చడానికే బ్లూప్రాగ్ ఆరోపణలు...జగన్ కు లోకేశ్ సవాల్
 

ప్రతిపక్షాలన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనపై విమర్శలు ఎక్కుపెడుతున్నా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గడం లేదు. దీని అమలుపై మరింత  వేగాన్ని పెంచిన ప్రభత్వం... ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఐఏఎస్ అధికారి వెట్రిసిల్వికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది.  

అంతకు ముందే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధనకు కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా, మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ, ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన జరగనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనకోసం తల్లిదండ్రులనుంచి, ఉపాధ్యాయులు, ఇతర మేధావులనుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చిందని మంత్రివర్గం తెలిపింది. తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటున్నారని, దీనివల్లే ప్రై వేటు విద్యాసంస్థల్లో ఏటా ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతోందని కేబినెట్ వెల్లడించింది.

click me!