జగ్గయ్యపేట: భార్య మాట వినలేదని భర్త ఆత్మహత్య

Published : Nov 14, 2019, 07:19 AM IST
జగ్గయ్యపేట: భార్య మాట వినలేదని భర్త ఆత్మహత్య

సారాంశం

భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఓ వ్యక్తి తన భార్య మాట వినడం లేదని ఉరేసుకుని మరణించాడు. 

జగ్గయ్యపేట: భార్య భర్తల మనస్పర్థలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని మరణించాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలోగల మల్లెల ఉపేంద్ర అనే వ్యక్తికి రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా కూసుమంచి మల్లెపల్లి గ్రామానికి చెందిన గుంజి కోటయ్య కుమార్తె అనూషతో వివాహం జరిగింది,

భార్యాభర్తలు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే ఓ విషయంలో భార్య తన మాట వినలేదని,మనస్తాపం చెంది ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఉపేంద్ర మృతి చెందాడు,మృతదేహాన్ని పోస్టుమార్టం కి తరలించారు, చిల్లకల్లు ఎస్ఐ అభిమన్యు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మచిలీపట్నంలో చైన్ స్నాచింగ్ 

మచిలీపట్నంలోని  చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే చైన్ స్నాచింగ్ జరిగింది. ఆర్సీఎం చర్చ వద్ద ఇంటికి వెళుతున్న ఓ వ్యక్తి మెడలో నుండి బంగారు చైన్ లాక్కుని నిందితుడు బైక్ పై పరారయ్యాడు.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌