ఇటీవల ఏపి సీఎం జగన్ పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర పదజాలంతోో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోో పవన్ కు వైసిపి వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు మానుకోవాలని...ఆయన ఎవరంటే వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ఆర్ సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగినవిధంగా సమాధానం చెబుతామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు జైలుకు వెళ్లారు, ఎవరెవరు కుట్ర చేశారు అనే విషయం పవన్ కు రాజకీయంగా దత్తత తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే చాలా సందర్భాలలో బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ధిక్కరించకపోతే...అదే పార్టీలో వుండివుంటే జగన్ పై కేసులు ఉండేవి కాదని స్వయంగా చంద్రబాబే చెప్పిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉందని పేర్కొన్నారు.
undefined
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై పదేపదే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న ప్యాకేజీ స్టార్ తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎందుకు పూనకంతో ఊగిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై వైసిపి నాయకులు ఎవ్వరూ తప్పుడు ఆరోపణలు చేయలేదన్నారు. ఆయన మాదిరిగా ప్యాకేజీలు తీసుకుని తిట్టడం వైసిపి నాయకులకు అలవాటు లేదన్నారు.
read more కర్నూల్ ఇసుక సత్యాగ్రహం ర్యాలీలో ఉద్రిక్తత
టిడిపి అధినేత చంద్రబాబు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులు తమ పిల్లలు, మనవళ్లను ఏ మీడియం పాఠశాలలో చదివిస్తున్నారు అని అడిగితే పవన్ కు పూనకం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. అంటే వారితో కలిసి మీరు ఏమైనా కుట్ర చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.
విజయవాడ రోడ్లపై కొట్టుకుందాం రమ్మన్న పవన్ సినిమాల్లో మాత్రమే హీరో అని మరిచిపోవద్దని... మత్తులో మాట్లాడితే ప్రజలు చిత్తు చేస్తారని హెచ్చరించారు. వైఎస్ జగన్ పరిస్థితి అటో ఇటో అయితే 151 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని పవన్ అనడాన్ని బట్టి టీడీపీ కలిసి ఏమైనా కుట్రలు చేశారా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
read more పొలిటికల్ కరెప్షన్ ఓకే... వారి అవినీతే తగ్గాలి...: మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ బెదిరింపులు, హెచ్చ మాటలు మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే తమ పార్టీ వైసీపి పెద్దలను కలిసి విచారణ చేయించాలని కోరతామమని మెహబూబ్ షేక్ తెలిపారు.