అమ్మాయిల హాస్టల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థి... స్పందించిన విద్యామంత్రి

By Arun Kumar PFirst Published Feb 26, 2020, 7:54 PM IST
Highlights

నూజివీడు ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్లో అబ్బాయి ప్రవేశించి పట్టుబడిన ఘటనపై విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. 

నూజివీడు ఐఐఐటీ ఘటనలో ఇటీవల వెలుగుచూసిన ఘటనపై విచారణ కోసం ఓ కమిటీ వేసినట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దీనిపై నివేదిక వచ్చాకే చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. అప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వం తరపున ఎలాంటి యాక్షన్ తీసుకోబోమని... తప్పెవరిదో తేలితే మాత్రం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల ఓ ఘటన కలకలం రేపింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి రెడ్ హ్యాండెడ్ గా సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

read more  సమస్యలెన్ని ఎదురైనా అది చేసి తీరతాం...: మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు

దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. అతను లేడిస్ హాస్టల్‌లోకి ప్రవేశించడానికి సాయం చేసిన ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేసింది. అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్‌లో యువకుడు ఉండటం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. 

ఆ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఐఐఐటీలో ఒక ఫెస్ట్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్ధి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.

కిటికీ ఊచలను విరగ్గొట్టి అతను గదిలోకి ప్రవేశించినట్లుగా సమాచారం. అతనిని లోపలే ఉంచే ఆ గదికి చెందిన విద్యార్ధినులు బయటకు వెళ్లినట్లుగా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గుర్తించింది.

read more  ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ దిశగా అడుగులు... సీఎం జగన్ ఆదేశాలు

ఈ వ్యవహారంతో ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం మరోసారి వెలుగుచూడటంతో యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇప్పటికే విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపైనే తాజాగా విద్యామంత్రి స్పందించారు. 


 

click me!