ఆంధ్ర ప్రదేశ్ నుండి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం రేపు(మంగళవారం) కేరళ ప్రభుత్వంతో సమావేశం కానున్నట్లు ఆయన ప్రకటించారు.
విజయవాడ: అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టేందుకు కేరళ ప్రభుత్వంతో నవంబర్ 5న సమావేశం కానున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అందుకోసం వివిధ ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు వెల్లడించారు.
కేరళ సీఎం ఆహ్వానం మేరకు 5వ తేదీ మంగళవారం తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవదాయ శాఖ మంత్రులు సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున తాను హాజరవుతున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. గతంలో అయ్యప్ప స్వాములు కోసం శబరిమలైలో అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించాలని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
undefined
శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు నవంబరు 5న తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశంజరగుతోందన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆహ్వానం పంపారని తెలిపారు.
read more చంద్రబాబుకు మరో షాక్ ... వైసీపీలో చేరిన మాజీ మంత్రి సోదరుడు
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలని కోరనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థతో పాటు తెలుగు అయ్యప్పలకు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా, స్పష్టంగా తెలుగు భాషలో ఏర్పాటు చేయాలని సూచించనున్నామన్నారు. నీలకంఠ, పంబ సన్నిధి వద్ద తెలుగు అయ్యప్ప భక్తులకు తాగునీరు, భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలని... అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు మంత్రి తెలిపారు.
read more జనం నీ వెంటవుంటే... రెండు చోట్లా ఎందుకు ఓడిపోతావు: పవన్‌పై కొడాలి నాని ఫైర్
రాష్ట్రం నుండి శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులకు, భక్తులకు ఇబ్బంది కలగనివ్వంకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వాటికి సహకరించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు...రేపు జరిగే సమావేశంలో దీన్ని కేరళ ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.