తప్పని తిప్పలు... క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

By Arun Kumar P  |  First Published Dec 16, 2019, 6:48 PM IST

రాష్ట్రంలో ఉల్లి కొరత ఏర్పడటానికి వైసిపి అసమర్ధ పాలనే కారణమని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. నిత్యావసర వస్తుదవులను కూడా జగన్ ప్రభుత్వం ప్రజలకు అందించలేకపోవడం దారుణమన్నారు.  


విజయవాడ:  ఆకాశాన్నంటిన ఉల్లి ధర ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తోంది. ప్రభుత్వం వివిధ మర్గాల్లో వినియోగదారులకు కేవలం  రూ.25కే కిలో ఉల్లిపాయలు అందిస్తోంది. అయినప్పటికి ప్రతిపక్ష టిడిపి నాయకులు ప్రజలపక్షాన గళమెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 

పాయకాపురం మోడల్ రైతు బజార్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినియోగదారులతో కలిసి ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చున్నారు. ఓ బస్తాను చేతపట్టుకుని క్యూలోనే తన వంతు వచ్చేవరకు నిల్చుని ఉల్లిపాయలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Latest Videos

undefined

కిలో ఉల్లిపాయల కోసం గంట నుంచి రెండు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.  మహిళలు, పురుషులతో  పాటు వృద్దులు ఇలా  గంటలతరబడి క్యూలో నిల్చోడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

దిశ చట్టం వల్లే మరో యువతిపై అత్యాచారం... చంద్రబాబు ఆరోపణలపై మంత్రి సీరియస్

వినియోగదారులతో కలిసి తాను క్యూలో నిలుచుని వారి ఇబ్బంది ఏ స్థాయిలో వుందో స్వయంగా అనుభవించానని అన్నారు. నిత్యావసరాల కోసం ఇలా గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నీరుగార్చిందని మండిపడ్డారు.  కిలో ఉల్లిపాయలు కోసం గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదని...ముఖ్యంగా రోజువారి కూలిపని చేసుకునే నిరుపేదలు రైతుబజార్ లోనే బారులు తీరాల్సి వస్తోందన్నారు. 

ఉల్లిని డిమాండ్ తగిన విధంగా సమకూర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని... పేదల పనులు లేక పస్తులుంటున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ ప్రజలకు పాట్లు తప్పడం లేదని అన్నారు. 

read more దిశ చట్టంపై స్పందించిన డిల్లీ సర్కార్... జగన్ ప్రభుత్వానికి లేఖ

టిడిపి ప్రభుత్వంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ  ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. క్రిస్మస్ ,రంజాన్ , సంక్రాంతి కానుకలు ఎత్తివేశారని... ఐదు రూపాయలకి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లు మూసివేశారని అన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కొనసాగించాలని...అలాగే ఉల్లిపాయలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని సరఫరా చేయాలని ఉమ ప్రభుత్వానికి  సూచించారు. 


 

click me!