పంటకు ధర లేదని... కౌలు రైతు ఆత్మహత్య

By telugu teamFirst Published Dec 16, 2019, 9:14 AM IST
Highlights

గౌరారం గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు ఆర్థిక సమస్యలను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా భూమి  సాగులో పంట ధర రాక అప్పుల బాధలు ఎక్కువయ్యాయి.


గత నాలుగేళ్లుగా...ఏ పంట పండించినా సరైన ధర లభించడం లేదని ఆ కౌలు రైతు ఆవేదన చెందాడు. సంవత్సరమంతా కష్టపడినా.. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. కనీసం భార్య, బిడ్డలను కూడా పోషించేకపోతున్నానని మదనపడ్డాడు. చివరకు వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరారం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... గౌరారం గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు ఆర్థిక సమస్యలను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా భూమి  సాగులో పంట ధర రాక అప్పుల బాధలు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కాగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

రైతుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి... వారంతా కన్నరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

click me!