పారాసిటమాల్ వేసుకుని... బ్లీచింగ్ పౌడర్ రాసుకుంటే...: వైసిపి ఎంపీపై బుద్దా సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2020, 02:38 PM ISTUpdated : Mar 21, 2020, 02:56 PM IST
పారాసిటమాల్ వేసుకుని... బ్లీచింగ్ పౌడర్ రాసుకుంటే...: వైసిపి ఎంపీపై బుద్దా సెటైర్లు

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు.

గుంటూరు: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లోనూ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 275 పాజిటివ్ కేసులు నమోదవగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇప్పటికే ముగ్గురు ఈ వైరస్ బారినపడగా చాలామంది రోజురోజుకు అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ తనకేమీ పట్టదన్నట్లు వ్యవహరించడం మంచిదికాదని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎప్పటిలాగే ట్విట్టర్ వేదికన సీఎం జగన్, ఎంపి విజయసాయిరెడ్డి లపై విరుచుకుపడ్డారు. 

''ఎంపి విజయసాయి రెడ్డి గారు పేరాసిట్మాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు. కొంపతీసి వైఎస్ జగన్ గారు చెప్పారని మొహానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా? తేడాగా మాట్లాడుతున్నారు'' అని వెంకన్న ఎద్దేవా చేశారు. 

read more  కరోనా ఎఫెక్ట్: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం...

ఇక స్థానికసంస్థల పరిణామాలపై స్పందిస్తూ ''కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో పేటెంట్ రైట్స్ జగన్ గారికి ఉన్నాయనే విషయం మర్చిపోయారా? అధికారులను దొంగ పనులకు వాడుకొని జైలుకి పంపిన చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నావా? మీ క్రిమినల్ గేమ్స్ కి ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త'' అంటూ హెచ్చరించారు. 
 
''అధికారుల లేఖలతో వైఎస్ జగన్ గారితో సహా మీకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యినట్టు ఉంది విజయసాయి రెడ్డి గారు. అధికార దాహంతో స్థానిక ఎన్నికల సంధర్భంగా దౌర్జన్య పర్వానికి తెరలేపారు, హత్యాయత్నాలు చేసారు. పొలిసు వ్యవస్థని బ్రష్టు పట్టించారు. ఓటమి భయంతో నీచమైన పనులు చేసారు'' అని జగన్, విజయసాయిలపై సంచలన కామెంట్స్ చేశారు వెంకన్న. 

 ''ఆఖరికి ఎన్నికల సంఘం కమిషనర్ ని సైతం బూతులు తిడుతూ బెదిరించారు. మీరు చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్టు రమేష్ కుమార్ గారు కేంద్రానికి లేఖ రాసారు. విచారణ ప్రారంభమైంది చేసిన అరాచకాలకు త్వరలోనే ఏ 1, ఏ 2 లతో సహా విచ్చలవిడిగా నోటితో రెచ్చిపోయిన వారు సైతం ఊచలు లెక్కపెట్టడం ఖాయం'' 

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : మహిళలకే కాదు ఇక ఈ మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?