ఒక్కటే ఇల్లు ఉండాలి... కనకదుర్గమ్మను కోరుకున్నదదే: చంద్రబాబు

Arun Kumar P   | Asianet News
Published : Jan 01, 2020, 11:24 AM IST
ఒక్కటే ఇల్లు ఉండాలి...  కనకదుర్గమ్మను కోరుకున్నదదే: చంద్రబాబు

సారాంశం

నూతర సంవత్సరాది రోజున ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.  

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దర్శించుకున్నారు. నూతర సంవత్సరాది కావడంతో ఉదయమే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న చంద్రబాబు దంపతులకు దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయం బయట చంద్రబాబు మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రానికి ఒకటే ఇల్లు ఉండాలన్నారు. 

read more  ఏపి గవర్నర్ ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపు

ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదుకోట్ల ప్రజలు ఆవేశంగా ఉన్నారని.. వారి భవిష్యత్‌ గురించి ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. అప్పట్లో విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారని.. ఎగతాళి చేసినోళ్లు ఇవాళ తెలంగాణ డెవలెప్‌ని చూడాలని తెలిపారు. 

సీఎంకు, మంత్రి మండలికి జ్ఞానోదయం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఏపి రాజధానిగా అమరావతి ఉండాలని... అలాగే అన్ని జిల్లాలు డెవలెప్ అవ్వాలని ప్రతి ఒక్కరు సంకల్పం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.

read more  సీఎం జగన్ పై పాట... డిప్యుటీ సీఎం టిక్ టాక్ వీడియో వైరల్

చంద్రబాబు దంపతుల వెంట ఎంపీ కేశెనేబి నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌