పవన్ నిజంగానే తిక్కలోడు...: వైసిపి ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

Arun Kumar P   | Asianet News
Published : Dec 31, 2019, 06:06 PM ISTUpdated : Dec 31, 2019, 06:23 PM IST
పవన్ నిజంగానే తిక్కలోడు...: వైసిపి ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

సారాంశం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న  రైతుల నిరసనకు మద్దతు తెలిపిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలే కాదు సామాన్యులు సైతం నిరసన బాట పట్టారు. గతకొద్ది రోజులుగా రాజధాని ప్రాంతంలోని గ్రామాలన్ని అట్టుడుకున్నాయి. ఈ నేపథ్యంలో  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని  అమరావతి  ప్రాంత రైతులుకు మద్దతుగా నిలిచి మంగళవారం నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వైసిపి పార్టీ నాయకులు ఆయనపై విమర్శలు  ఎక్కుపెట్టారు.   

పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం పిచ్చి కళ్యాణ్, తుగ్లక్ కళ్యాణ్ అనుకున్నామని ఇప్పుడే ఆయన ఓ తిక్కలోడని స్ఫష్టమయ్యిందని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు.  కాబట్టి ఓ తిక్కలోడు గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగేనని అన్నారు. తనసినిమాల్లో చేసినట్టు  రోడ్లపై స్టంట్స్ చేస్తున్నారని అన్నారు. 

పవన్ కు ముళ్ల కంచె కాదు..కేవలం ఒక్క ముల్లు గుచ్చుకున్నా చాలు అక్కడి నుండి పారిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని... అప్పుడు పవన్ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారా అని రమేష్ ప్రశ్నించారు. 

read more  2020లో ఏపి ప్రభుత్వం ఏం చేయనుందంటే: సీఎం జగన్

మరో వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... పవన్ పూటకో మాట మాట్లడుతున్నారని అన్నారు. గతంలో రాజధానిని తెలుగుదేశం వాళ్లు ఆవాసంగా చేసుకున్నారంటూ పవన్ ఆరోపించారని పవన్ ఆరోపించారని... అలా రైతులకు గత ప్రభుత్వం అన్యాయం చేసినా పవన్ ఎందుకు  ప్రశ్నించలేదన్నారు. 

అమరావతి కూడా ఓ రకమైన రాజధానిగా ఉంటుందని... అసెంబ్లీ, రాజ్ భవన్ ఇక్కడే ఉంటాయని  తెలిపారు. పవన్ చట్టాన్ని, పోలీసులను గౌరవించాల్సిన పని లేదా అని విష్ణు నిలదీశారు. 

ఇవాళ ఉదయం నుండి అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సచివాలయానికి వెళ్లనుండటం, పవన్ నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా  పోలీసులకు, పవన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

తాను కూడ పోలీసు కొడుకునేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోలీసులకు చెప్పారు. తనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రోడ్లపై ముళ్లకంచెలను ఎందుకు వేశారని పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు.  మందడం వెళ్లే సమయంలో  నాలుగు చోట్ల రోడ్లపై బైఠాయించి పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

read  more  పవన్... మూడు రాజధానులంటే మూడు పెళ్లిల్లలా కాదు: నారమల్లి పద్మజ

 రాజధాని రైతులకు మద్దతుగా నిలిచేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలుసుకొనే కార్యక్రమానికి పోలీసులు అడ్డు తగిలారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల రైతులతో మాట్లాడిన తర్వాత మందడం వైపుకు  పవన్ కళ్యాణ్ వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు.

సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు అడ్డుపడ్డారు. సీఎం సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత  పవన్ కళ్యాణ్ ను తుళ్లూరు వెళ్లాలని పోలీసులు సూచించారు.

 సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత  మందడం గ్రామానికి వెళ్లాలని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. అయితే మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా వెంకటపాలెం వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపై ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మందడం -వెంకటపాలెం గ్రామాల మధ్య  రోడ్డుపైనా నాలుగు చోట్ల పవన్ కళ్యాణ్ బైఠాయించారు.

రోడ్లపై పోలీసులు వేసిన ముళ్లకంచెను  మందడం గ్రామస్తులు తొలగించారు.ఈ క్రమంలో ముళ్లకంచెలో కొందరు గ్రామస్థులు పడి గాయపడ్డారు. ఈ క్రమంలోనే  ముళ్ల కంచెను దాటుకొని పవన్ కళ్యాణ్ మందడం వైపుకు వెళ్లారు.

ఈ క్రమంలోనే పోలీసులు పదే పదే ఆయనను అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహానానికి గురయ్యారు. తాను కూడ పోలీసు కొడుకునే అని ఒకానొక దశలో తేల్చి చెప్పారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌