
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. పరమపద ద్వారం దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారి సేవల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.