స్టేషన్ ఘనపూర్: చేతకానివాడు, ఒక్క రూపాయి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నాడని, చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టేషన్ ఘనపూర్: చేతకానివాడు, ఒక్క రూపాయి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నాడని, చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరచడం కాదని, మగాడైతే ఆర్థిక సహాయం చెయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగిన, పదవి ఇప్పిస్తాననో, పనులు ఇప్పిస్తాననో రూపాయి తీసుకున్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ శ్రీహరి విసిరారు. పదవులు , పనులను అమ్ముకుంటూ.. సిగ్గులేకుండా మళ్ళి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కడియం శ్రీహరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.