Jan 9, 2023, 4:08 PM IST
మెదక్ : రైతు సంక్షేమం కోసం అనుక్షణం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన రైతు బాంధవుడని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు... ఇలా రైతులకు కేసీఆర్ సర్కార్ అండగా నిలుస్తోందన్నారు. రైతు బంధు ద్వారా 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు పక్షపాతి మన సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతుబంధు వేశామన్నారు. అలాగే ఇప్పటివరకు 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా ద్వారా ఐదు లక్షల చొప్పున ఇచ్చామని హరీష్ తెలిపారు