Sep 4, 2019, 12:13 PM IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ్‌సై సౌందర రాజన్ కు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి నియామక పత్రాలను అందించారు. ఈ నెల 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సౌందరరాజన్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులను గిరి మంగళవారం నాడు సౌందరరాజన్ కు చెన్నైలో అందించారు.
ఈ నెల 8వ తేదీన సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ చేసింది.ఆయనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. తెలంగాణకు 9 ఏళ్ల 3 మాసాలకు పైగా నరసింహన్ బాధ్యతల్లో కొనసాగారు.