శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. గంటలు రోజులయ్యాయి.. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ మాత్రం ఇంకా కనిపించలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం SLBC ప్రమాదంపై దృష్టి పెట్టాయి.