vuukle one pixel image

ఎవ్వరినీ వదిలిపెట్ట... చుక్కల చూపించడం ఖాయం : సిరిసిల్ల సెస్ నూతన ఛైర్మన్ వార్నింగ్

Chaitanya Kiran  | Published: Dec 28, 2022, 12:30 PM IST

సిరిసిల్ల :  రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకుని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు బిఆర్ఎస్ నేత చిక్కాల రామారావు. ఈ క్రమంలో సెస్ పాలకవర్గం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తన ప్రత్యర్థులకు రామారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసి బద్నాం చేయడానికి ప్రయత్నించిన ఎవ్వరినీ వదిలిపెట్టబోనని... భవిష్యత్ లో చుక్కలు చూపించడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల ముందు తన గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన చేతగాని దద్దమ్మలు ఎవ్వరినీ వదిలిపెట్టబోనని నూతన సెస్ ఛైర్మన్ రామారావు హెచ్చరించారు.