
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. కానీ, ఈ అసెంబ్లీ సెషన్ చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే చాలాకాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి కరచాలనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.