Jun 13, 2022, 10:48 AM IST
సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి అలజడి రేగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ సిద్దమైన నేపథ్యంలో ట్రయల్ రన్ కు అధికారులు సిద్దమయ్యారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ లో భూమిని కోల్పోయిన నిర్వాసితులు ఒప్పందం ప్రకారం బెనిఫిట్స్ అందలేదని ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు సిద్దమైన సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్సడంతో పోలీసులు నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసారు. దీంతో పలువురి తలలు పగలగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.