
భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రైతుల హక్కులను కాపాడటం తమ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. భూ సేకరణ వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.