Karimnagar MLC Election 2021: అంబులెన్స్ లో వచ్చి... స్ట్రెచర్ పడుకునే ఓటేసిన ఎంపిటిసి

Dec 10, 2021, 5:24 PM IST

కరీంనగర్: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎంపిటిసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన‌ ఎంపిటిసి చాడ శోభ కాలికి సర్జరీ అయి అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన  ఓటుహక్కుని ఎలాగైనా వినియోగించుకొవాలని ఆమె భావించింది. కాలినొప్పితో బాధపడుతునే అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని స్ట్రెచర్ పైనే పడుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు.