Galam Venkata Rao | Published: Feb 28, 2025, 7:00 PM IST
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పాలనా పరంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా మనమంతా కలిసే ఉన్నామని చెప్పారు.