హైదరాబాద్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
హైదరాబాద్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నిన్న సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు వర్షం కలిగించిన బీభత్సం అంతాఇంతా కాదు. రోడ్లన్నీ చెరువులయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఈ ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన కేటీఆర్ ని స్థానికులు నిలదీశారు.