గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళా ఖాతంలో 2.1 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఇది మంగళవారానికి మరింత తీవ్రం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో 1500 మీటర్ల ఎత్తు వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.