Jun 8, 2020, 10:26 AM IST
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉదయం 8.30 గంటల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దర్శనం ప్రారంభమయ్యింది. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు దర్శనానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఆలయంలో థర్మల్ స్కానింగ్, శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు. దాదాపు తొంభై రోజుల తరువాత ఆలయాలు భక్తులతో కళకళ లాడుతున్నాయి.