Oct 21, 2022, 3:42 PM IST
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తన పిసిసి పదవినుండి తప్పించే కుట్రలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే సంచలన ఆడియో ఒకటి బయటపడింది. టిపిసిసి స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని మునుగోడు నాయకులను కోరుతూ పోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది. మునుగోడుకు చెందని కాంగ్రెస్ లీడర్ తో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మునుగోడులో కాంగ్రెస్ ఓడితే ఈ దెబ్బతో తాను పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని... ఏదయినా వుంటే అప్పుడు చూసుకుంటానని కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు... కాబట్టి పార్టీలను చూడకుండా ఆయనకే ఓటెయ్యాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు ఆడియో బయటపడింది.